TDP ట్విటర్ అకౌంట్ హ్యాక్
టీడీపీ ట్విట్టర్ డీపీని మార్చారు. మనిషి అవతార్ తలను డీపీగా పెట్టారు. కాగా.. తమ పార్టీ అకౌంట్ హ్యాక్ అవడం వెనుక..
తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ ను మరోసారి సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. వెంటనే అకౌంట్ పేరు, ఫొటోను మార్చేసి ఏవేవో ట్వీట్లు చేసేస్తున్నారు. హ్యాక్ చేసిన అకౌంట్ పేరును టైలర్ హాబ్స్ గా మార్చారు. బయో లో ''అల్గారిథమ్స్, ప్లాటర్స్, పెయింట్‌తో పని చేసే విజువల్ ఆర్టిస్ట్. కొన్నిసార్లు నా సైట్‌లో కళ గురించి రాస్తాను. ఫిండెంజా సృష్టికర్త, క్యూక్యూఎల్ సహ-సృష్టికర్త'' అని రాసుకొచ్చారు.
టీడీపీ ట్విట్టర్ డీపీని మార్చారు. మనిషి అవతార్ తలను డీపీగా పెట్టారు. కాగా.. తమ పార్టీ అకౌంట్ హ్యాక్ అవడం వెనుక అధికార పార్టీ హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అకౌంట్ హ్యాక్ అవడంపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశామని, త్వరలోనే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకూ టిడిపి ట్విట్టర్ అకౌంట్ ను ఐదు లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.