నేటి నుంచి పోలవరంలో విదేశీ నిపుణుల బృందం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో నేటి నుంచి విదేశీ నిపుణుల బృందం పర్యటించనుంది
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో నేటి నుంచి విదేశీ నిపుణుల బృందం పర్యటించనుంది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ బృందం పర్యటిస్తుంది. కొత్తగా నిర్మించే డయాఫ్రం వాల్, ఇసిఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణాలపై ప్రాజెక్టు అధికారులతో చర్చించనుంది. విదేశీ నిపుణులు పోలవరం ప్రాజెక్టును నాలుగు రోజుల పాటు సందర్శించి పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందచేయనున్నారు.
నివేదిక ఇచ్చిన తర్వాత...
ప్రాజెక్టు భద్రతకు అవసరమైన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ నిపుణుల బృందం సూచించనుంది. విదేశీ నిపుణుల బృందం ఇచ్చే సూచనలను అనుసరించి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు అవకాశాలున్నాయి. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ప్రధమ ప్రాధాన్యతగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న సంగతి తెలిసిందే.