Revanth Reddy : తిరుమలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమలలో నేడు వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారి దర్శించుకోనున్నారు

Update: 2024-05-22 01:32 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమలలో నేడు వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారి దర్శించుకోనున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలసి నిన్ననే తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవ ధర్మారెడ్డి అధికారులు స్వాగతం పలికారు. రాత్రికి కుటుంబ సభ్యులతో కలసి రచన అతిధి గృహంలో రేవంత్ రెడ్డి బస చేశారు.

మనవడి...
ఆయన తన మనవడికి పుట్టు వెంట్రుకలు సమర్పించడానికి తిరుమలకు కుటుంబ సభ్యులతో కలసి వచ్చారు. ఈరోజు స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి ఆయన తిరుమలకు రావడంతో అధికారులు ఆయన దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


Tags:    

Similar News