స్టీల్‌ప్లాంట్‌లో సింగరేణి డైరెక్టర్లు
విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది
విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే తాము కొనుగోలు చేస్తామని ప్రకటించింది. బిడ్డింగ్ లో పాల్గొంటామని కూడా తేల్చింది. మోదీ ప్రయివేటీకరణ ఆలోచనను వ్యతిరేకిస్తూ ప్లాంట్ ను తాము తీసుకుంటామని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలో పయనింప చేయవచ్చని భావిస్తుంది.
టేక్ ఓవర్ చేయాలని....
అలాగే విశాఖ స్టీల్ నుంచి ఉత్పత్తి అయిన ఇనుమును కూడా తెలంగాణలోని ప్రాజెక్టులకు వినియోగించుకోవడం, మిగిలిన దానిని విక్రయించడం ద్వారా కొంత ఆదాయం సమకూరుతుందని కు తెలంగాణా ప్రభుత్వం భావిస్తుంది. సింగరేణి ఆధ్వర్యంలో సీఎండీ ఆదేశాల మేరకు సింగరేణికి చెందిన ముగ్గురు డైరెక్టర్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఈ రోజు వచ్చారు. రేపు కూడా ఉండి ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు స్టీల్ ప్లాంట్ టేక్ ఓవర్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఈ డైరెక్టర్లు వచ్చారు.