బాలయ్య మాట్లాడితే ఆరు నెలలకు అర్థమవుతుంది

నందమూరి బాలకృష్ణ మాట్లాడితే ఆరునెలల కు కాని అర్థం కావడం లేదని తెలుగు అకాడమి ఛైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు;

Update: 2023-04-11 12:42 GMT

నందమూరి బాలకృష్ణ మాట్లాడితే ఆరునెలల కు కాని అర్థం కావడం లేదని తెలుగు అకాడమి ఛైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. లోకేష్ పాదయాత్రలో రోజుకో కామెడీ కనపడుతుందని ఆమె అన్నారు. ప్రతి పక్ష పార్టీ రోజు రోజు కు దిగజారి పోతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించింది. ఏమీ రాని దద్దమ్మ, ఒక్క చోట గెలవని వ్యక్తి సీఎం జగన్ ను విమర్శిస్తున్నారని లక్ష్మీపార్వతి లోకేష్ పై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను చెప్పలేని పరిస్థితుల్లో, బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. 98 శాతం ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని ఆమె ప్రశంసించారు. సోషల్ మీడియాలో పనికి మాలిన వెధవల్ని , ఇలాంటి కుక్కల్ని పోషిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

చంద్రబాబు అంతటి...
సీఎం జగన్ మోహన్ రెడ్డి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, టీడీపీ పాలనలో సీబీఐ రాకూడదని ఎందుకు ఆంక్షలు విధించారని ప్రశ్నించారు. దుబాయ్, స్విట్జర్లాండ్ లో చంద్రబాబు ఐదు లక్షలు కోట్లు దాచి పెట్టారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఈ నల్లధనం స్వదేశానికి రప్పించాలని ప్రధాని మోదీకి ఆమె విజ్ఞప్తి చేశారు.పవన్ కళ్యాణ్ చదువుతున్న పుస్తకాలు జ్ఞానం ఎక్కడకి పోయిందన్నారు. హిందూపురం ప్రజలకు సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని, సైకో ఎవరో తేల్చుకోవాలని బాలకృష్ణకు ఆమె సూచించారు. వెధవ పనులు చేస్తున్న చంద్రబాబు సైకో అని, చంద్రబాబు పాపాలు పండి పోయి, చివరి దశకు చేరుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News