వైసీపీ అంతానికి ఇదే ఆరంభం : అయ్యన్న
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ప్రతి రౌండ్ లోనూ టీడీపీకే ఆధిక్యత కనిపిస్తుంది. నాలుగో రౌండ్ అయ్యే సరికి 20 వేల ఆధిక్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిరంజీవి రావు న్నారు. మూడు రౌండ్లు ముగిసే సరికి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు 36,302 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కు 23,025 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి మాధవ్ ు కేవలం 4,107 ఓట్లుమాత్రమే లభించాయి.
ఉత్తరాంధ్ర విశ్వసించలేదు...
మొత్తం 2,00926 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకూ 84,301 ఓట్లను మాత్రమే లెక్కించారు. ఇంకా 1,16,896 ఓట్లు లెక్కించాల్సి ఉంది. జగన్ ని ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసించలేదని పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. రాజధాని కబుర్లను ప్రజలు నమ్మలేదని, రాజధాని పేరుతో జగన్ విశాఖలో చేసిన విధ్వంసం, అలాగే ఈ 4 ఏళ్ళ చీకటి పాలన ప్రజలు గుర్తు చేసుకుని టీడీపీకి అండగా నిలిచారన్నారు. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే కాపాడగలరని గుర్తించారన్నారు. వైసీపీ అంతానికి ఆరంభం ఇదేనని అయ్యన్న పాత్రుడు అన్నారు.