తిరుపతికి చేరుకున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి తిరుపతిలోని పద్మావతి అతిధి గృహానికి చంద్రబాబు చేరుకోనున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరుమల చేరుకుంటారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో శ్రీవారిని దర్శించుకుని అనంతరం తిరిగి తిరుపతి చేరుకుంటారు. తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు పెద్దయెత్తున పార్టీ నేతలు, క్యాడర్ స్వాగతం పలికాయి.
బహిరంగ సభకు...
మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చంద్రబాబు తిరుపతిలో జరుగుతున్న అమరావతి రైతుల మహాసభకు హాజరవుతారు. ఈ సభకు టీడీపీ నుంచి చంద్రబాబు, బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ నుంచి రామకృష్ణ, జనసేన నుంచి హరిప్రసాద్ లు హాజరుకానున్నారు. సీపీఎం ఈ సభకు దూరంగా ఉంది. బీజేపీతో కలసి వేదికను పంచుకోలేమని, రాజధాని అమరావతికి మాత్రం మద్దతు ఉంటుందని ప్రకటించింది.