ఇద్దరు సీనియర్ నేతల సస్పెన్షన్.. పార్టీ నేతలకు వార్నింగ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇద్దరు పార్టీ నేతలను సస్పండ్ చేశారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇద్దరు పార్టీ నేతలను సస్పండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందున వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఓటమికి కారణాలపై నివేదిక తెప్పించుకున్న చంద్రబాబు ఇద్దరు సీనియర్ నేతలను సస్పెండ్ చేశారు. గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలూరి రంగారావులను సస్పెండ్ చేశారు.
అన్ని కమిటీలు రద్దు....
దీంతో పాటు నెల్లూరులో ఉన్న అన్ని డివిజన్ కమిటీలను రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. త్వరలో కొత్త కమిటీలను నియమిస్తామని ఆయన తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా కాని, ప్రత్యర్థి పార్టీతో కుమ్మక్కయిందని తెలిసిన వెంటనే క్రమశిక్షణ చర్యలు తప్పవని చంద్రబాబు నేతలకు వార్నింగ్ ఇచ్చారు. కొత్త నాయకత్వానికి అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక్క డివిజన్ లోనూ టీడీపీ గెలవకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకుని మరికొందరిపై చర్యలుంటాయని ఆయన తెలిపారు.