నేడు అమరావతికి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు అమరావతికి రానున్నారు.;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు అమరావతికి రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. రేపు చంద్రబాబునాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకు ముందుగా ఆయన కేబినెట్ కూర్పు పై సీనియర్ నేతలతో చర్చించనున్నారని తెలిసింది.
పవన్ కూడా...
రేపు చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారా? లేదా? అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. మిత్రపక్షాలతో కూడా ఆయన చర్చలు జరపనున్నారు. జనసేన, బీజేపీ నుంచి కూడా కేబినెట్ లోకి తీసుకోవాల్సి ఉండటంతో వారితో చర్చించిన తర్వాత మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని కొందరు తెలిపారు. నేడు మంగళగిరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రానున్నారు.