నేడు, రేపు గోదావరి జిల్లాల్లో బాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 4,5 తేదీలలో గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.

Update: 2023-05-04 03:13 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 4,5 తేదీలలో గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను చంద్రబాబు పరామర్శించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుండి చంద్రబాబు బయలుదేరి 12 గంటలకు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బెండపూడి కాలువ గట్టు రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ 1.30 గంట వరకూ వర్షం ముంపునకు గురైన వరి చేలను ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామానికి చేరుకుని ముంపునకు గురైన పొలాలను పరిశీలిస్తారు.

కోనసీమ జిల్లాలో...
అక్కడ నుండి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం చేరుకుని చంద్రబాబు రాత్రికి ఎన్.వి.ఆర్. ఫంక్షన్ హాలులో బస చేస్తారు. 5వ తేదీ ఉదయం ఎన్.వి.ఆర్ ఫంక్షన్ హాలు నుండి బయలుదేరి ఉదయం 10.15 గంటలకు రామచంద్రపురం మండలం వెంగయ్యమ్మపేటకు చేరుకుని అక్కడ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను చంద్రబాబు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కడియంలో పంట పొలాలను పరిశీలిస్తారు.
సెంట్రల్ జైలుకు వెళ్లి...
సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకుని రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ లతో చంద్రబాబు ములాఖత్ అవుతారు. అనంతరం రాజమహేంద్రవరం నగరం తిలక్ రోడ్డులోని ఆదిరెడ్డి నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మలను పలుకరించి చంద్రబాబు వారికి ధైర్యం చెబుతారు. సాయంత్రం 6.45 గంటలకు మధురపూడి ఎయిర్ పోర్టుకు చేరుకుని విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళతారు.


Tags:    

Similar News