చంద్రబాబు టూర్ షెడ్యూల్ మారింది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈరోజు నుంచి వరద ప్రభావతి ప్రాంతాల్లో పర్యటిస్తారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈరోజు నుంచి వరద ప్రభావతి ప్రాంతాల్లో పర్యటిస్తారు. అయితే ఆయన ముందుగా కడపకు వెళ్లాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన పర్యటన మారింది. ఈరోజు తొతుల తిరుపతికి చేరుకుంటారు మధ్యహ్నం 3.30 గంటలకు తిరుపతి చేరుకుని నగరంలో వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను పర్యవేక్షిస్తారు.
తిరుపతి పట్టణంలో...
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు ముత్యాలరెడ్డిపల్లె, దుర్గానగర్ కాలనీ, కృష్ణానగరర్, గాయత్రి నగర్, పద్మావతి మహిళా యూనివర్సిటీ తదితర ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించి వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తారు. వరదల కారణంగా దెబ్బతిన్న వారిని పరామర్శిస్తారు. చంద్రబాబు రాత్రికి తిరుపతిలోనే బస చేయనున్నారు.