రేపు జంగారెడ్డిగూడెంకు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపు జంగారెడ్డిగూడెంలో పర్యటించనున్నారు.;

Update: 2022-03-13 03:45 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపు జంగారెడ్డిగూడెంలో పర్యటించనున్నారు. ఆయన ఒకరోజు పర్యటన నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లాకు రానున్నారు. జంగారెడ్డి గూడెంలో ఇటీవల వరస మరణాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. నాటు సారా తాగి మృతి చెందారని టీడీపీ ఆరోపిస్తుంది. జంగారెడ్డి గూడెంలో పదిరోజుల సమయంలో పదహారు మంది వరకూ మృతి చెందారు.

నాటుసారా....
అక్రమ మద్యం, నాటుసారా వల్లనే మరణాలు సంభవిస్తున్నాయని టీడీపీ ఆరోపిస్తుంది. అయితే టీడీపీ వాదనను ప్రభుత్వం ఖండిస్తుంది. అవి వేర్వేరు కారణాలతో సంభవించిన మరణాలని చెబుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రేపు జంగారెడ్డి గూడెంలో పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.


Tags:    

Similar News