ఏడాది తర్వాత చంద్రబాబు...?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఆయన పాత ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరుసటి రోజు కందుకూరులో పొగాకు రైతులతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వారి సంమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
మూడు రోజుల పాటు...
అనంతరం కావలి నియోజకవర్గంలో జరిగే రోడ్ షోలో చంద్రబాబు పాల్గొంటారు. మూడోరోజు కోవూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఉండనుంది. కార్యకర్తలతో సమావేశం కానున్నారు. బహిరంగ సభను నిర్వహిస్తారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పెద్దయెత్తున తరలి రావాలని పార్టీ శ్రేణులు నేతలు కోరారు. దాదాపు ఏడాది తర్వాత చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నారు.