నేడు రెండో రోజు చంద్రబాబు పర్యటన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు రెండో రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు రెండో రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. నిన్న ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కక్కునూరు మండలాల్లో చంద్రబాబు పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. నష్టపోయిన పంటలను పరిశీలించారు. వరదల తాకిడికి దెబ్బతిన్న గృహాలను సందర్శించారు. పునరావాస కేంద్రాలను సందర్శించి వారికి భరోసా ఇచ్చారు. శివకాశీపురంలోని పునరావాస కేంద్రంలో రాజధాని అమరావతి రైతులు ఇచ్చిన నిత్యావసర సరుకులను చంద్రబాబు బాధితులకు అందజేశారు.
ఈరోజు ముంపు మండలాల్లో....
రాత్రికి భద్రాచలంలో బస చేసిన చంద్రబాబు ఉదయం స్వామి వారిని దర్శించుకుంటారు అనంతరం ఆయన ముంపు మండలాల్లో పర్యటిస్తారు. ఎటపాక, వీఆర్ పురం, కూనవరం, మండలాల్లో పర్యటిస్తారు. ఈ మండలాల్లోలని తోటపల్లి, కోతుల గుట్ట, కూనవరం, రేఖ పల్లి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తారు.