ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. కుప్పం ఘటనపై ఆయనకు లేఖ రాశారు.;

Update: 2022-08-07 06:25 GMT
pawan kalyan, janasena, chandrababu, tdp, alliance
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. కుప్పం ఘటనపై ఆయనకు లేఖ రాశారు. తప్పు చేసిన పార్లమెంటు సభ్యులను సమర్థించే నీచ స్థాయికి కొందరు పోలీసులు వెళ్లారని చంద్రబాబు లేఖ లో పేర్కొన్నారు. బరితెగించిన పోలీసులను అదుపులో పెట్టాలని డీజీపీకి లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు రోజురోజుకూ దిగజారుతున్నారని ఆయన లేఖలో తెలిపారు.

శాఖకే తలవంపులు....
పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ఆ శాఖకే తలవంపులు తెచ్చిపెడుతుందని అన్నారు. ఒక ఎంపీ చేసిన పనిని నిరసిస్తూ కుప్పంలో ఆందోళనకు దిగిన టీడీపీ నేతలతో దేశాన్ని తగలబెట్టండి అని వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేస్తే డీజీపీ సమర్థిస్తారేమో కాని, ప్రజలు సమర్థించరని చంద్రబాబు అన్నారు. కుప్పం టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.


Tags:    

Similar News