నేడు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన

తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీ నేడు రాజవొమ్మింగిలో పర్యటించనుంది;

Update: 2022-02-03 04:13 GMT

తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీ నేడు రాజవొమ్మింగిలో పర్యటించనుంది. నిన్న రాజవొమ్మింగి మండలంలో కల్తీ కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. దీనిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిజనిర్ధారణ కమిటీ వేశారు. ప్రభుత్వం మద్యం పాలసీతోనే ఈ కల్తీ కల్లు మరణాలు సంభవించాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.

గిరిజనుల మరణానికి....
దీనిపై చంద్రబాబు మాజీ మంత్రి కిడారి కిషోర్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మరికొందరితో నిజనిర్థారణ కమిటీని వేశారు. ఈ కమిటీ నేడు రాజవొమ్మింగి మండలంలో పర్యటించి కల్తీకల్లు తాగి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించనుంది. మరణాలకు గల కారణాలను ఆరా తీయనుంది. అయితే పోలీసులు మాత్రం అనుమతి లేదని చెబుతున్నారు.


Tags:    

Similar News