73వ రోజుకు చేరిన యువగళం
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 73వ రోజుకు చేరుకుంది
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 73వ రోజుకు చేరుకుంది. నేడు కూడా ఆలూరు నియోజకవర్గంలో జరుగుతుంది. ఇప్పటి వకూ లోకేష్ 933 కిలోమీటర్ల దూరం నడిచారు. ఉదయం ఏడు గంటలకు ఎంకె కొట్టాల బస నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. 7.05 గంటలకు ఎంకె కొట్టాలలో స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. 8.40 గంటలకు గుండ్లకొండలో గ్రామస్తులతో భేటీ అయి వారి సమస్యలపై చర్చిస్తారు. 9.50 గంటలకు గుడిమిర్ల గ్రామంలో రైతులతో సమావేశమవుతారు.
933 కి.మీల నడిచిన...
ఉదయం పదకొండు గంటలకు బుర్రుకుంటలో స్థానికులతో లోకేష్ సమావేశం అవుతారు. 11.40 గంటలకు వెంకటాపురం శివార్లలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. 12.40 గంటలకు వెంకటాపురం శివార్లలో భోజన విరామానికి ఆగుతారు. తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు వెంకటాపురం శివార్ల నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఐదు గంటలకు వెంకటాపురంలో స్థానికులతో సమావేశమవుతారు. రాత్రికి నారా లోకేష్ పల్లెదొడ్డిలో బస చేయనున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.