టీడీపీ నేత పట్టాభికి బెయిల్
గన్నవరం ఘటనలో తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరామ్ కు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ కు న్యాయమూర్తి అనుమతించారు
గన్నవరం ఘటనలో తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరామ్ కు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ కు న్యాయమూర్తి అనుమతించారు. మూడు నెలల పాటు ప్రతి గురువారం కోర్టుకు హాజరవ్వాలని కోరింది. విచారణకు పట్టాభి సహకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
షరతులతో కూడిన...
అలాగే పాతికవేల పూచికత్తను సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. సాక్షులను ప్రభావితం చేయరాదని పట్టాభిని న్యాయమూర్తి ఆదేశించారు. గన్నవరంలో సీఐపై జరిగిన దాడి ఘటనలో పట్టాభి ప్రస్తుతం రాజమండ్రి జైలులో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.