మాజీ మంత్రి సోమిరెడ్డి ధర్నా

తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు నెల్లూరు జిల్లాలో హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు

Update: 2022-07-14 04:22 GMT

తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు నెల్లూరు జిల్లాలో హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. ఉదయగిరి నారాయణ హత్యకు నిరసనగా టీడీపీ చలో నెల్లూరుకు పిలుపునిచ్చింది. ఈ కేసులో పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన ఇంటి వద్ద తన అనుచరులతో ధర్నాకు దిగారు.

టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్...
నిన్నటి రాత్రి నుంచే టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కావలిలోనూ 15 మంది టీడీపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. నెల్లూరు నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుమూలల నుంచి టీడీపీ నేతలు రాకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News