నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఉదయం బస నుంచి బయలుదేరే ముందు రజకులతో సమావేశమయ్యారు. వారి సమస్యలపై లోకేష్ చర్చించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే తిరుపతిలో రజక భవన్ కు స్థలాన్ని కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రజకులకు ఎమ్మెల్సీ ఇచ్చిన ఘనత టీడీపీదేనని నారా లోకేష పేర్కొన్నారు. దొంగ కేసులు పెట్టిన పోలీసులను వదిలపెట్టబోనని నారా లోకేష్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
చంద్రగిరిలో ఫ్లెక్సీలను తొలగించడంతో...
ఉదయం కొంగరపల్లి గ్రామస్థులతో భేటీ అయిన లోకేష్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు కాశిపెంట్లలో మహిళలతో లోకేష్ ముఖాముఖి సమావేశమవుతారు. అనంతరం కాశిపెంట్లలో భోజన విరామానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి పాదయాత్రను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.45 గంటలకుక కల్ రోడ్డు వద్ద గ్రామస్థులతో సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి గాదంకి టోల్ గేట్ సమీపంలో లోకేష్ రాత్రి బస చేయనున్నారు. కాగా చంద్రగిరిలో లోకేష్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.