నేడు లోకేష్ యాత్ర ఇలా
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 15వ రోజుకు చేరుకుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 15వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ లోకేష్ 169.5 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈరోజు రాత్రి బస చేసిన రేణుకాపురం నుంచి పాదయాత్రను లోకేష్ ప్రారంభించనున్నారు. ఉదయం 8.35 గంటలకు గొల్లకండ్రిక గ్రామస్థులతో రచ్చబండ కార్యక్రమం ఉంటుంది. అనంతరం ఎగువ కమ్మ కండ్రికలో రైతులతో మాటా మంతీ కార్యక్రమంలో పాల్గొంటారు.
సమావేశాలతో...
మధ్యాహ్నం 12.05 గంటలకు దిగువ కమ్మ కండ్రికలో బెల్లం తయారీదారులతో లోకేష్ సమావేశమవుతారు. 1.10 గంటలకు కాపు కండ్రికలో బలిజ కాపులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఎస్సీ సామాజికవర్గీయులతో ముఖాముఖి కార్కక్రమంలో పాల్గొంటారు. కాపు కండ్రికలోనే భోజన విరామం కోసం ఆగుతారు. కాపు కండ్రిక నుంచి బయలుదేరి సాయంత్రం ఎస్‌ఆర్ పురం గ్రామ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాత్రి ఏడు గంటలకు ఎస్ఆర్‌పురం హనుమాన్ టెంపుల్ ఎదుట విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు.