50వ రోజుకు చేరిన లోకేష్ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి యాభైవ రోజుకు చేరుకుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి యాభైవ రోజుకు చేరుకుంది. పస్తుతం పుట్టపర్తి నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకూ లోకేష్ 625 కిలోమీటర్ల మేర దూరం నడక సాగించారు. ఈరోజు ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్రను ప్రారంభించి గాజులకుంటలో రైతులతో సమావేశమవుతారు. ఉదయం 10.55 గంటలకు వడ్డేపల్లిలో ఎస్టీ సామాజికవర్గం ప్రజలతో లోకేష్ భేటీ ఉంటుంది. అనంతరం 11.50 గంటలకు ఒడిసి గ్రామంలో భోజన విరామానికి ఆగుతారు.
సమావేశాలతో...
భోజన విరామం అనంతరం బయలుదేరి ఒడిసి ఎమ్మార్వో కార్యాలయం వద్ద మైనారిటీలతో సమావేశమవుతారు. అనంతరం ఒడిసి రెయిన్ బో అకాడమీ వద్ద జరగనున్న బహిరంగ సభలో లోకేష్ మాట్లాడతారు. అక్కడి నుంచి మహ్మదాబాద్ క్రాస్ వద్ద ఆమడగూరు స్థానికులతో సమావేశమవుతారు. వీరితో పాటు స్థానికులు, సత్యసాయి సేవకులతోనూ లోకేష్ సమావేశం కానున్నారరు. అనంతరం సాయంత్రం రామయ్య పేట విడిది కేంద్రంలో బస చేయనున్నారు.