లోకేష్ యువగళం @ 600
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు 600 కిలోమీటర్లకు చేరుకుంటుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు 600 కిలోమీటర్లకు చేరుకుంటుంది. 600 కిమీల వద్ద శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించనున్నారు. లోకేష్ పాదయాత్ర నేటికి 47వ రోజుకు చేరుకుంది. కదిరి నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర జరుగుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఈ పాదయాత్రకు పెద్దయెత్తున పార్టీ కార్యాకర్తలు తరలి వస్తున్నారు.
యాత్ర ఇలా...
ఇప్పటి వరకూ ఆయన 591 కిలోమీటర్లు నడిచారు. కదిరి నియోజకవర్గం చినపిల్లోలపల్లి నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ చేనేత కార్మికులతో లోకేష్ సమావేశమవుారు. లోకేష్ యాత్ర ఘాజీఖాన్‌పల్లి, పయాలవారి పల్లి, నల్లచెరువు రైల్వే స్టేషన్, రత్నాలపల్లి, బొమ్మిరెడ్డి పల్లి, చిన్నం యాళ్లపల్లి నుంచి జోగన్న పేటకు చేరుకుంటుంది. అక్కడ జరిగే బహిరంగ సభలో లోకేష్ ప్రసంగిస్తారు. రాత్రికి జోగన్న పేటలో బస చేయనున్నారు.