బ్రేక్ తర్వాత ప్రారంభమయిన యువగళం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. తారకరత్న మృతితో పాదయాత్రకు రెండు రోజుల పాటు బ్రేక్ ఇచ్చిన లోకేష్ నేటి నుంచి పాదయాత్రను కొనసాగించనున్నారు. ఇప్పటి వరకూ లోకేష్ 296.6 కిలోమీటర్ల మేర నడిచారు. శ్రీకాళహస్తిలోని ఆర్డీవో ఆఫీసు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రలో తొలుత ముస్లిం సామాజికవర్గం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
నేడు మూడు వందల కిలోమీటర్లు...
అనంతరం 9.20 గంటలకు మిట్టకండ్రిగలో స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు తొండంనాడులో ప్రజలతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకుంటారు. తొండమనుపురం దిగువ వీధిలో 300 కి.మీ పాదయాత్ర పూర్తయిన సందర్భంగా శిలావిష్కరణ చేస్తారు. సుబ్బనాయుడు కండ్రికలో స్థానికులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం వెంకటాపురంలో భోజన విరామానికి ఆగుతారు. అనంతరం బంగారుపల్లిలో వన్యకుల క్షత్రియులతో లోకేష్ సమావేశమవుతారు. అనంతరం కోబాక విడిది కేంద్రంలో బస చేస్తారు.