నేడు నంద్యాల జిల్లాలోకి నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు నంద్యాల జిల్లాలోకి ప్రవేశిస్తుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు నంద్యాల జిల్లాలోకి ప్రవేశిస్తుంది. లోకేష్ పాదయాత్ర నేటికి 69వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ లోకేష్ 874.1 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈరోజు ఉదయం డోన్ నియోజకవర్గంలోకి నారా లోకేష్ పాదయాత్ర ప్రవేశించనుంది. ఉదయం ఏడుగంటలకు తాడిపత్రి నియోజకవర్గం రాయలచెరువు నుంచి ప్రారంభమైన పాదయాత్ర ప్రారంభమైంది. 7.45 గంటలకు చందన గ్రామంలో స్థానికులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. దాయలమడుగులో మహిళలతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డోన్ నియోజకవర్గంలో...
ఉదయం 10 గంటలకు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. 10.10 గంటలకు డి.రంగాపురంలో స్థానికులతో లోకేష్ సమావేశమవుతారు.11.20 గంటలకు నల్లమేకలపల్లి గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తారు.11.50 గంటలకు రాంపురం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు.12.05 గంటలకు జక్కసానికుంట్లలో ఎస్సీ సామాజికవర్గీయులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం1.05 గంటలకు జక్కసానికుంట్లలో భోజన విరామానికి ఆగుతారు. మధ్యాహ్నం 3 గంటలకు జక్కసానికుంట్లలో యువతతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు జక్కసానికుంట్ల నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. సాయంత్రం ఐదు గంటలకు పిఆర్ పల్లి గ్రామస్తులతో లోకేష్ సమావేశమవుతారు. రాత్రికి గుడిపాడులో లోకేష్ బస చేయనున్నారు.