TDP : పట్టాభి పూర్తిగా కనిపించడం మానేశాడేంటో... కారణం ఇదేనా?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కూటమి విజయం సాధించిన తర్వాత కనిపించడం మానేశారు

Update: 2024-08-19 08:09 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కూటమి విజయం సాధించిన తర్వాత కనిపించడం మానేశారు. దాదాపు రెండు నెలల నుంచి ఆయన పెద్దగా వినిపించడం లేదు. కనిపించడం లేదు. పార్టీ అధికారంలో లేనప్పడు ఏ నేత అప్పటి అధికార పార్టీపై విమర్శలు చేసేందుకు వెనుకాడినప్పుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఒక్కరే తన మాటలతో ివిరుచుకుపడేవారు. అంతేకాదు ఆయన ప్రతి రోజూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి అధికార పార్టీని చీల్చిచెండాడేవారు. అలాంటి పట్టాభి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయిస్తున్నట్లు కనపడుతుంది.

విపక్షంలో ఉన్నప్పుడు...
కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చేసిన పదునైన విమర్శలతో నాటి అధికార వైసీీపీకి ఆయన శత్రువుగా మారారు. ఆయన ఇంటిపై దాడులు కూడా జరిగాయి. పట్టాభి కొన్ని కేసుల్లో అరెస్టయి రాజమండ్రి జైలుకు వెళ్లి వచ్చారు. ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. మాటలు పడ్డారు. గాయపడ్డారు. అయినా టీడీపీ విషయంలో వెనక్కు తగ్గలేదు. చంద్రబాబు నాయుడు స్వయంగా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటికి వచ్చి మరీ ఆయనను పరామర్శించి వెళ్లారు. మిగిలిన సీనియర్ నేతలు అందరూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ పట్టాభి అంతా తానే అయి కేంద్ర పార్టీ కార్యాలయంలో తన వాయిస్ ను బలంగా వినిపించే వారు. అప్పుడప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ లో మాత్రం కనిపిస్తున్నారు.
కీలక పదవి?
అయితే కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కు అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన పదవి వస్తుందని అందరూ భావించారు. రేపు చంద్రబాబు భర్తీ చేయబోయే పోస్టులలో పట్టాభికి ఖచ్చితంగా ఒక పదవి వస్తుందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. యువకుడు కావడం, మంచి వాగ్దాటి ఉండటంతో పట్టాభికి మంచి పదవినే చంద్రబాబు కట్టబెట్టే అవకాశాలున్నాయంటున్నారు. అందుకోసమే పట్టాభి వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు పార్టీ అగ్రనాయకత్వం నుంచి పట్టాభికి సంకేతాలు అందినట్లు చెబుతున్నారు. అది కూడా కీలకమైన క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పదవిని చంద్రబాబు పట్టాభి కోసం సిద్ధం చేసినట్లు అంటున్నారు.
ఆచితూచి...
పదవిలోకి వచ్చిన తర్వాత కొంత ఆచితూచి మాట్లాడాలని, తక్కువగా మాట్లాడి ఎక్కువ పనులు చేయాలని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు మంత్రులు విపక్షానికి కౌంటర్లు ఇస్తుండటంతో ఇక తనకు పెద్దగా పనిలేదని ఆయన భావిస్తున్నారు. దీంతో పాటు పదవి వచ్చేంత వరకూ ఒకింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి అంశం పై కూడా ఆయన పెద్దగా స్పందించడం లేదంటున్నారు. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పదవి కోసమే వెయిట్ చేస్తున్నారని తెలిసింది. కొద్ది రోజులలోనే పట్టాభి తిరిగి యాక్టివ్ అవుతాడంటున్నారు.


Tags:    

Similar News