మోదీని కలిసిన టీడీపీ ఎంపీ... రీజన్ ఇదేనట

ప్రధాని నరేంద్రమోదీని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు కలిశారు.

Update: 2022-04-06 02:07 GMT

ప్రధాని నరేంద్రమోదీని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు కలిశారు. కుటుంబ సభ్యులతో కలసి రామ్మోహన్ నాయుడు ప్రధానిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీకి తన కుటుంబ సభ్యులను పరిచయం చేయడానికే రామ్మోహన్ నాయుడు ప్రధానిని కలిశారని, మర్యాదపూర్వకంగానే కలిసి తన కుమార్తెకు ప్రధాని నుంచి దీవెనలు అందుకున్నారని చెబుతున్నారు.

జగన్ కంటే ముందుగానే....
అయితే జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసే ముందుగానే రామ్మోహన్ నాయుడు మోదీని కలిశారని పెద్దయెత్తున ఒకవర్గం మీడియా ప్రచారం చేసింది. కానీ రామ్మోహన్ నాయుడు భేటీలో ఎటువంటి రాజకీయ అంశాలు లేవని, కేవలం మర్యాదపూర్వకంగా తన కుటుంబ సభ్యులను పరిచయం చేయడం కోసమే మోదీని కలిశారని రామ్మోహన్ నాయుడు సన్నిహితులు చెప్పారు.


Tags:    

Similar News