రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై లాఠీ ఛార్జి జరిగింది. కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది.

Update: 2022-08-25 06:24 GMT

కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై లాఠీ ఛార్జి జరిగింది. కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. కుప్పంలో అన్నా క్యాంటిన్ ను ప్రారంభించేందుకు వచ్చిన చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం వైసీపీ కార్యకర్తలు చేశారు. చంద్రబాబు అక్కడకు చేరుకోకముందే అన్నా క్యాంటిన్ ను ధ్వంసం చేశారు ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్సణ పడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జి చేశారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

దాడికి నిరసనగా...
అయితే వైసీపీ కార్యకర్తల దాడికి నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించారు. తన నిరసనను తెలియజేస్తున్నారు. పోలీసులు వైసీపీ నేతలకు కొమ్ము కాస్తున్నారని ఆయన ఆరోపించారు. పేదలకు ఉపయోగపడే అన్నా క్యాంటిన్ ను ప్రారంభం కాకుండా వైసీీపీ శ్రేణులు అడ్డుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతల అరాచకాలకు తెరపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ లోనే డీజీపీకి కుప్పంలో జరిగిన ఘటనలపై ఫిర్యాదు చేశారు.
కేంద్ర హోంశాఖకు లేఖ...
కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏదైనా జరిగితే తాము ఫైరింగ్ ఓపెన్ చేయాల్సి వస్తుందని చంద్రబాబు జెడ్ కేటగిరి భద్ర సిబ్బంది కేంద్ర హోంశాఖకు, రాష్ట్రం హోంశాఖకు లేఖ రాసినట్లు సమాచారం. స్థానిక పరిస్థితుల దృష్ట్యా తాము అనివార్య పరిస్థితుల్లో ఫైర్ ఓపెన్ చేయవచ్చని వారు లేఖలో తెలిపారు. కుప్పంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణల నేపధ్యంలో చంద్రబాబు వద్ద ఉన్న భద్రతాసిబ్బంది ఈమేరకు లేఖ రాశారని చెబుతున్నారు.


Tags:    

Similar News