చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు రోజుల సీఐడీ కస్టడీ, రిమాండ్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు రోజుల సీఐడీ కస్టడీ, రిమాండ్ ముగిసింది. దీంతో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆన్‌లైన్ ద్వారా విచారణ చేపట్టారు. చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని సీఐడీ అధికారులు కోరగా అక్టోబరు 5వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు నాయుడు సీఐడీ కస్టడీ ముగిసిన తరువాత రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచే వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడును సీఐడీ రెండురోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకొని విచారించింది. కొన్ని డాక్యుమెంట్స్ చూపించి ఈ నిధులు ఎటు వెళ్లాయని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. సీఐడీ రెండు బృందాలుగా ఆయనను ప్రశ్నించింది. రెండు రోజులపాటు ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా.. మొత్తం 12 గంటలపాటు చంద్రబాబును ఇంటరాగేషన్ చేసింది సీఐడీ అధికారుల బృందం. మొత్తం 12 గంటలపాటు చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. ప్రతీ గంటకకు అయిదు నిమిషాల బ్రేక్ ఇచ్చారు. చంద్రబాబు విచారణను వీడియో తీయించారు. అనంతరం బాబుకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసు విచారణ అధికారి డిఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో రెండు బృందాలగా విడిపోయి విచారణ చేశారు.