కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత తొలిసారి కడపకు...?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కడపకు చేరుకున్నారు. ఆయనకు కడప విమానాశ్రయంలో పెద్దయెత్తున అభిమానులు స్వాగతం పలికారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కడపకు చేరుకున్నారు. ఆయనకు కడప విమానాశ్రయంలో పెద్దయెత్తున అభిమానులు స్వాగతం పలికారు. అసెంబ్లీలో తన కుటుంబ సభ్యులను దూషించడంతో కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు తొలిసారి ప్రజల్లోకి వచ్చారు. దీంతో ఆయనను చూసేందుకు పెద్దయెత్తున ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపకే ఆయన కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత తొలిసారి వచ్చారు.
వరద బాధిత ప్రాంతాల్లో....
చంద్రబాబు ఈరోజు కడప జిల్లాలోని పులపుత్తూరు, మందపల్లి, గుండ్లూరు ప్రాంతాల్లో పర్యటిస్తారు. రాజంపేట నియోజకవర్గంలో ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన గ్రామాల్లోకి వెళ్లి వరద బాధితులను పరామర్శిస్తారు. పంట నష్టాన్ని స్వయంగా చూస్తారు. అక్కడి పార్టీ నేతలతో చర్చిస్తారు.