జగన్ కు నారా లోకేష్ లేఖ
ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు.
ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన లేఖలో కోరారు. అందరికీ పునరావాసం కల్పించాలని కోరిన నారా లోకేష్, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందరికీ ఇవ్వాలని లేఖలో జగన్ ను డిమాండ్ చేశారు. గతంలో జగన్ ప్రకటించిన పది లక్షల ప్యాకేజీని బాధితులకు అందచేయాలని కోరారు.
18 ఏళ్లు నిండిన వారందరికీ....
ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీని 2013 భూసేకరణ చట్టం ప్రకారం అమలు చేయాలని నారా లోకేష్ కోరారు. పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ ప్యాకేజీని అందించాలని కోరారు. పునరావస కాలనీల్లో అన్ని వసతులు కల్పించాలని నారా లోకేష్ లేఖలో జగన్ ను డిమాండ్ చేశారు. గ్రామాన్ని ఖాళీ చేయించిన తేదీనే కటాఫ్ తేదీగా పరిగణించాలని నారా లోకేష్ లేఖలో జగన్ ను కోరారు.