Summer Effect : రోహిణి కార్తె ప్రభావం మామూలుగా చూపించదటగా

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ఎండ వేడిమికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు

Update: 2024-05-29 04:28 GMT

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ఎండ వేడిమికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి వరకూ అకాల వర్షాలతో కొంత ఉపశమనం పొందని తెలుగు రాష్ట్రాల ప్రజలు మళ్లీ ఎండకు అల్లాడిపోతున్నారు. ఉక్కపోత కూడా తీవ్రమయింది, ఉదయం ఎనిమిది గంటల నుంచే ఉష్ణోగ్రతలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు...
రానున్న మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తీవ్రమయ్యే అవకాశముంది. రోహిణి కార్తె లో ఎండల తీవ్రత అధికంగానే ఉంటుంది. దాని ప్రభావం ఎక్కువగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు వడదెబ్బ తగలకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గర్భిణులు, వృద్ధులు, చిన్న పిల్లలు ఎండలకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.


Tags:    

Similar News