చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత తలెత్తింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ జెండాతో ఒక కార్యకర్త రావడంతో ఘర్షణ జరిగింది. దీంతో కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్ర గాయాలు కావడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించాలని చంద్రబాబు ఆదేశించారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. తన పర్యటనలో వైసీపీ కార్యకర్తలు వచ్చి అలజడి సృష్టిస్తున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని, శాంతిభద్రతలను పరిరక్షించాలని చంద్రబాబు ఫోన్ లోనే జిల్లా ఎస్పీని కోరారు.
ఫ్లెక్సీల కలకలం...
మరోవైపు చంద్రబాబు పర్యటనలో హనుమాన్ జంక్షన్ వద్ద ప్లెక్సీల కలకలం రేపాయి. గన్నవరం నియోజకవర్గంలో కీలక సమస్యలను ఎత్తిచూపుతూ, చంద్రబాబుని విమర్శిస్తూ ప్లెక్సీలు వెలిశాయి. డెల్టా షుగర్ ప్యాక్టరీని మూసివేయడం, మల్లవల్లి ఏపీఐఐసీ, గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములు తీసుకుని అర్హులైన వారికి పరిహారం ఇవ్వకుండా, విజయవాడ ఇన్నర్ రింగురోడ్డు నిర్మాణంలో ఓ రౌడీ షీటరు హోటల్ కూల్చకుండా రామవరప్పాడు కాల్వగట్లపై పేదల ఇళ్ళు కూల్చడం, హుదూద్ బాధితుల సాయం కోసం 50 లక్షలు విరాళంగా సేకరించి లోకేష్ కు ఇస్తే మాయం చేసారు, పోలవరం కాల్వ, బ్రహ్మయ్య లింగం చెరువు అభివృద్ది అంటూ సామంత మంత్రితో మట్టి దోపిడీ చేసినందుకు, లక్ష ఇళ్ళ పట్టాలంటూ పేదలకు స్థలాలు ఇవ్వకుండా మోసం చేసినందుకు స్వాగతం పలకాలా అంటూ నిలదీస్తూ చంద్రబాబు వచ్చే దారిలో పలుచోట్ల ఈ ప్లెక్సీలు కట్టారు..ఇదేమీఖర్మ చంద్రబాబు, బైబై బాబూ అంటూ రాశారు