అయ్యన్న ఇంటి వద్ద హైటెన్షన్
నర్సీపట్నం లోని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. పోలీసులు అదనపు బలగాలను దించారు.
నర్సీపట్నం లోని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. పోలీసులు అదనపు బలగాలను దించారు. గోడను కొంత కూల్చి వేసిన జేసీబీ డ్రైవర్ ను బెదిరించడంతో వారు దిగి వెళ్లిపోయారు. అనకాపల్లి నుంచి జేసీబీని తెప్పంచే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ శ్రేణులు కూడా పెద్దయెత్తున అయ్యన్న ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగాయి. వారిని నిలువరించేందుకు అదనపు బలగాలను పోలీసులు రప్పించాయి. దీంతో కూల్చివేతలను అడ్డుకున్న అయ్యన్న కుమారుడు రాజేష్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
అదనపు బలగాలను...
అయితే పంటకాల్వను అయ్యన్న పాత్రుడు ఆక్రమించారని ఇరిగేషన్ అధికారులు ధృవీకరించారు. పది అడుగుల మేర ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఇరిగేషన్ అధికారులు నిర్ధారణ చేశారు. పోలీసుల సహకారంతో మరికాసేపట్లో అయ్యన్న ఆక్రమించిన ఇంటి గోడ నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నారు.