గన్నవరం ఘర్షణ : టీడీపీ నేతలపై కేసులు
గన్నవరంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో నిన్నటి నుంచి టెన్షన్ నెలకొంది
గన్నవరంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో నిన్నటి నుంచి టెన్షన్ నెలకొంది. ఈ ఘటనలో టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు 60 మంది టీడీపీ నేతలపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
హత్యాయత్నం కేసు....
తెలుగుదేశం పార్టీ నేత పట్టాభితో పాటు 16 మంది పై కూడా కేసులు నమోదు చేశారు. బోడె ప్రసాద్ ను అరెస్ట్ చేసి నాగాయలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టాభిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అనేక మంది టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు నేడు న్యాయస్థానంలో ప్రవేశ పెట్టనున్నారు.