విశాఖలో ఉద్రిక్తత... చలో ఏయూకు నో పర్మిషన్

విశాఖపట్నం ఆంధ్రయూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Update: 2022-03-03 05:17 GMT

విశాఖపట్నం : విశాఖపట్నం ఆంధ్రయూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ ప్రసాద్ రెడ్డిని రీకాల్ చేయాలంటూ అఖిలపక్షం ఆందోళనకు పిలుపునిచ్చింది. చలో ఏయూ కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదని చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

హౌస్ అరెస్ట్ లు..
చలో ఏయూ కార్యక్రమాలకు వెళ్లనివ్వకుండా టీడీపీ నేతలు బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఏయూ వద్ద భారీగా పోలీసుల బలగాలు మొహరించాయి. ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. ఆందోళనకారులు ఎప్పుడైనా ఎటునుంచైనా రావచ్చన్న అనుమానంతో పోలీసులు చుట్టుపక్కలంతా పహారా కాస్తున్నారు.


Tags:    

Similar News