కొండపల్లిలో మళ్లీ టెన్షన్
కొండపల్లి మున్సిపల్ ఎన్నికలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. నిన్న జరగాల్సిన ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.
కొండపల్లి మున్సిపల్ ఎన్నికలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. నిన్న జరగాల్సిన ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కొండపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఈరోజు కూడా వైసీపీ, టీడీపీ శ్రేణులు చేరి నినాదాలు చేస్తున్నారు. ఎన్నికను నిర్వహించాల్సిందేనని తెలుగుదేశం పార్టీ పట్టుబడుతుంది. దీనిపై మున్సిపల్ అధికారులు ఎస్ఈసీకి నేడు నివేదిక అందించనున్నారు.
ఎస్ఈసీకి నివేదిక...
తాము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలను నిర్వహించలేమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎన్నిక నిర్వహించకపోతే కోర్టు ఆదేశాలను థిక్కరించినట్లవుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తం 20 మంది వార్డులున్న కొండపల్లి మున్సిపాలిటీలో 15 స్థానాలను టీడీపీ, 14 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిిషియో సభ్యుడిగా ఇక్కడ ఓటు వేయాలని భావిస్తున్నారు. వైసీపీ ఈ ఎన్నికలను అడ్డుకుంటుందని టీడీపీ ఆరోపిస్తుంది.