నేడు రద్దీ సాధారణం.. దర్శనానికి 6 గంటలు

ఆదివారం స్వామివారిని 84,539 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది. 39,812 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు..

Update: 2023-05-22 04:38 GMT

tirumala rush today

కొద్దిరోజులుగా భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతూ.. శ్రీనివాసుడి నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు ఆ వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వస్తుంటారు. సోమవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

ఆదివారం స్వామివారిని 84,539 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది. 39,812 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. నిన్న, ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. తిరుమల వెళ్లాలనుకునేవారు ఈ సమయంలో ప్లాన్ చేసుకోవడం మంచిది.


Tags:    

Similar News