జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసే.. ఈసీ నోటిఫికేషన్

గతంలో జనసేన పార్టీకి గ్లాజు గ్లాసును ఎన్నికల్లో గుర్తుగా పరిగణించలేమని ఈసీ చెప్పడంతో.. జనసైనికులు ఆందళన

Update: 2023-06-24 05:44 GMT

ఏపీలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీకి గ్లాజు గ్లాసు గుర్తునే కొనసాగిస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన పార్టీని రిజర్వుడు సింబల్ కలిగిన పార్టీల జాబితాలోనే ఉంచింది ఈసీ. గతంలో జనసేన పార్టీకి గ్లాజు గ్లాసును ఎన్నికల్లో గుర్తుగా పరిగణించలేమని ఈసీ చెప్పడంతో.. జనసైనికులు ఆందళన చెందారు. తాజాగా ఈసీ చెప్పిన ఈ వార్తతో.. జనసేనకు బిగ్ రిలీఫ్ లభించింది. వైసీపీ, టీడీపీ మాత్రమే రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలని పేర్కొంది.

మరో ఐదు జాతీయ పార్టీలు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్న 11 పార్టీలకు ఈసీ గుర్తులను కేటాయించింది. ఆమ్ ఆద్మీని జాతీయ పార్టీగా, సీపీఐ, ఎన్ సీపీలను రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీలుగా గుర్తించింది. రాష్ట్ర పార్టీల జాబితాలో ఉన్న ఆర్ఎల్ డీని రిస్టర్డ్ పార్టీల జాబితాలో చేర్చింది. కానీ ఈ పార్టీకి ఎలాంటి గుర్తుని కేటాయించలేదు. ఇక బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కేఆర్ బీహెచ్ఎన్ చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేశారు.


Tags:    

Similar News