శనివారం .. రష్ ఏమాత్రం తగ్గలేదు

శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. టోకెన్ రహిత సర్వదర్శనానికి శనివారం..;

Update: 2023-06-10 03:31 GMT
tirumala rush today, tirumala update

tirumala rush today, tirumala update

  • whatsapp icon

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కొద్దిరోజులుగా తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో కంపార్టుమెంట్లన్నీ నిండిపోతున్నాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. టోకెన్ రహిత సర్వదర్శనానికి శనివారం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయి.. కాంప్లెక్స్ వెలుపలికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.

కాగా.. నిన్న(జూన్ 9) శ్రీవారిని 74,502 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారిలో 38,052 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శుక్రవారం స్వామివారికి రూ.3.73 కోట్ల హుండీ ఆదాయం సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది. కాగా.. తిరుమలకు వచ్చే భక్తులకు అన్నపానీయాలకు లోటు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు అందుబాటులో త్రాగునీరు, అన్నప్రసాద వితరణ కేంద్రాలను ఉంచింది.


Tags:    

Similar News