Vidadala Rajinii : విడదల జెండా మార్చడానికి రెడీ అయ్యారా? ఆయనను కలవడం వెనుక?

మాజీ మంత్రి విడదల రజని కూడా వైసీపీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయన్న ప్రచారం జరుగుతుంది.;

Update: 2025-02-14 07:31 GMT
vidadala rajani, ex minister,  ysrcp, janasena
  • whatsapp icon

మాజీ మంత్రి విడదల రజని కూడా వైసీపీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయన్న ప్రచారం జరుగుతుంది. వరసగా కేసులు నమోదవుతుండటంతో పాటు సేఫ్ ప్లేస్ చూసుకోవడానికి వైసీపీ నేతలు చాలా వరకూ కూటమి పార్టీలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది నేతలు పార్టీని వీడివెళ్లిపోయారు. మరికొందరు లైన్ లో ఉన్నారని చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజని కూడా పార్టీని వీడే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతుంది. విడదల రజని ఆర్థికంగా బలమైననేత. సామాజికవర్గం పరంగా కూడా ఆమెకు కలసి వచ్చే అంశమే. భర్త కాపు సామాజికవర్గం కావడం కూడా ఆమెకు రాజకీయంగా పార్టీ మారడానికి మార్గాలు సులువుగా మారనున్నాయని అంటున్నారు.

ఆర్థికంగా... సామాజికపరంగా...
విడదల రజని కుటుంబం విదేశాల్లో వ్యాపారాలు చేసి బాగానే సంపాదించారు.తర్వాత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రత్తిపాటి పుల్లారావు ఉండటంతో టీడీపీలో సీటు దక్కదని తేలిపోయి వైసీపీలోకి జంప్ చేశారు. టీడీపీ ఉన్నసమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విమర్శలుచేసినా ఆమెను పార్టీలోకి తీసుకోవడానికి ప్రధానకారణం సామాజికవర్గంతో పాటు క్యాష్ పార్టీ కావడమే.అయితే వైసీపీలో్ చేరినవెంటనే చిలకలూరిపేట అసెంబ్లీ టిక్కెట్ ను 2019 లో సాధించి ఆ ఎన్నికల్లో విక్టరీ కొట్టారు. అయితే అంతటితో ఆమె లక్ ఆగలేదు. మంత్రి వర్గ విస్తరణలో విడదల రజనీకి ఏకంగా మంత్రిపదవి లభించింది. అలాంటి ఇలాంటి పదవి కాదు.. ఏకంగా వైద్య శాఖను విడదల రజనికి జగన్ కేటాయించారు.
అయిష్టంగానే పోటీ చేసి...
అయితే 2024 ఎన్నికల్లో మాత్రం విడదల రజనికి వైసీపీలో చిలకలూరిపేట టిక్కెట్ దక్కలేదు. ఆమెను గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి పార్టీ అధినాయకత్వం షిఫ్ట్ చేసింది. అయితే వైసీపీ అధికారంలోకి రాకపోవడమే కాకుండా రాష్ట్రంలో కేవలం పదకొండు స్థానాలు మాత్రమే రావడంతో పాటు విడదల రజనీకూడా ఓటమి పాలయ్యారు. చిలకలూరి పేటను వదిలి వచ్చేందుకు ఇష్టం లేకపోయినా జగన్ మాటను కాదనలేక, మరొకసారి అధికారంలోకి వస్తామని భావించి ఆమె వైసీపీనుంచి పోటీచేశారు. అయితేకొద్ది రోజుల నుంచి ఆమె సైలెంట్ గానే ఉంటున్నారు. దీంతో పాటు ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై వరసగా కేసులు కూడా నమోదు అవుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు.
కాపు కార్డుతో...
తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే బాలినేని జనసేనలో చేరి కీలకంగా ఉన్నారు. అంటే విడదల రజని కాపు కార్డు ఉపయోగించి జనసేనలోకి ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో కూటమి నుంచి పోటీ చేయడానికి ఆమె రెడీ అవుతున్నట్లు కనిపిస్తుంది. త్వరలోనే జగన్ కు షాకిచ్చి జనసేనలోకి జంప్ అవుతారన్న క్యాంపెయిన్ మాత్రం గుంటూరు జిల్లాలో జోరుగా నడుస్తుంది. అయితే బాలినేని జనసేనఅధినేత పవన్ కల్యాణ్ తో మాట్లాడిన తర్వాత విడదల చేరికపై క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయని తెలిసింది. త్వరలోనే విడదల జనసేనలోకి జంప్ అవుతారన్నది విశ్వసనీయ సమాచారం.


Tags:    

Similar News