Breaking : ఏపీ అసెంబ్లీలో టెన్షన్.. వాయిదా.. ప్రసారాలు నిలిపివేత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. సభ వాయిదా పడింది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. జీవో నెంబరు వన్ పై తాము ఇచ్చిన వాయిదా తీర్మానం పై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. మరోవైపు మంత్రులు టీడీపీ సభ్యులతో వాదనకు దిగారు. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాన్ని వాయిదా వేశారు. తమపై వైసీపీ సభ్యులు దాడి చేశారంటూ టీడీపీ సభ్యులు ఆరోపించారు. అయితే స్పీకర్ పై పేపర్లు చించివేస్తూ బీభత్సం సృష్టించారని టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
ఘర్షణకు దిగడంతో...
టీడీపీ ఎమ్మెల్యేలు బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు తమపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడికి దిగారంటూ ఆరోపించారు. టీడీపీ సభ్యులే తమపై దాడి చేశారంటూ వైసీపీ సభ్యులు ఆరోపించారు. వీడియో ఫుటేజీని పరిశీలించాలని వారు కోరుతున్నారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభ జరుగుతుండగా అకస్మాత్తుగా ఘర్షణ చోటు చేసుకోవడంతో ప్రత్యక్ష ప్రసారాలను కూడా నిలిపివేశారు. సభను వాయిదా వేసిన స్పీకర్ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నట్లు తెలిసింది. టీడీపీ సభ్యులపై దాడిని పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. వెల్ లో కూర్చుని టీడీపీ సభ్యులు నిరసన తెలుపుతున్నారు.