గుడివాడలో హైటెన్షన్

గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు మరికాసేపట్లో గుడివాడ చేరుకోనున్నారు

Update: 2023-04-13 13:42 GMT

గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు మరికాసేపట్లో గుడివాడ చేరుకోనున్నారు. గుడివాడలో రోడ్ షో‌లో పాల్గొననున్నారు. దీనికి ప్రతిగా వైసీపీ నేతలు కూడా పెద్ద యెత్తున మొహరించారు.చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ నేతలు హెచ్చరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

చంద్రబాబు పర్యటనతో...
దాదాపు ఐదు వందల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇరు పార్టీల నేతలు ఒకే చోట మొహరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసీపీ కార్యాలయం సమీపంలో దుకాణాలను కూడా మూసివేయించారు. ఇరు పార్టీల నేతలు మొహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. శరత్ థియేటర్ వద్ద వైసీపీ కార్యకర్తపై మాజీ ఎంపీ మాగంటి బాబు అనుచరులు దాడి చేయడంతో టెన్షన్ నెలకొంది.


Tags:    

Similar News