తుపానులోనూ తగ్గని భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. భారీ వర్షాలు కురుస్తున్నా భక్తుల తాకిడి మాత్రం తగ్గలేదు
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. భారీ వర్షాలు కురుస్తున్నా భక్తుల తాకిడి మాత్రం తగ్గలేదు. సోమవారం కూడా స్వామి వారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 14 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇప్పుడు క్యూ లైన్ లోకి ప్రవేశించే భక్తులకు అదనంగా మరో ఆరుగంటల సమయం పట్టే అవకాశముంది.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 72,466 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,123 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం4.29 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.