Andhra Pradesh: డోలీలో నిండు గర్భిణి.. ఆసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ లో గిరిజనుల కష్టాలు తీరేట్లు కనపడటం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో సరైన రహదారులు లేక అవస్థలు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గిరిజనుల కష్టాలు తీరేటట్లు కనపడటం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు సరైన రహదారులు లేక అవస్థలు పడుతున్నారు. జ్వరమొచ్చినా.. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తినా డోలీలో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా గిరిజనుల తలరాత మాత్రం మారలేదు. అరుకోలయ మండలం బస్కి పంచాయతీ కొంత్రాయిగుడకు చెందని సమర్ధి డాలిమ్మ పురిటి నొప్పులు వచ్చాయి. అయితే ఆమను ఆసుపత్రికి తరలించేందుకు రోడ్డు మార్గం లేకపోవడంతో కుటుంబ సభ్యులు, సన్నిహతులు కలసి డోలీలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది.
గిరిజనుల కష్టాలను...
అంబులెన్స్ వచ్చేందుకు కూడా ఆ గ్రామానికి దారి లేకపోవడంతో డోలీ సాయంతో మాడగ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. అయితే కిలో మీటర్ దాటిన తర్వాత అంబులెన్స్ రావడంతో దానిలో ఆసుపత్రికి తరలించారు. కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వమయినా తమ సమస్యలను తీర్చాలని, గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని ఈ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.