Tirumala : శనివారం కూడా రష్ లేదే... రీజన్ ఇదే

తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెద్దగా లేదు. శనివారం అయినా కూడా భక్తుల సంఖ్య అంచనా వేసినట్లుగా లేదు.

Update: 2024-02-03 02:02 GMT

Tirumala

తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెద్దగా లేదు. శనివారం అయినా కూడా భక్తుల సంఖ్య అంచనా వేసినట్లుగా లేదు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కావడం, పదోతరగతి పరీక్షలు దగ్గరపడటం వంటి కారణాలు కూడా భక్తుల రద్దీ తగ్గడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కారణంగా చెబుతున్నారు. ఈరోజు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం రెండు నుంచి మూడు గంటల్లో పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.

ఆదాయం కూడా...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 58,842 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,796 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.1 కోట్ల రూపాయలు వచ్చింది.


Tags:    

Similar News