Tirumala : తుపాను ఎఫెక్ట్... తిరుమలలో నేరుగా దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. క్యూ లైన్లలో వేచి ఉండగానే నేరుగా భక్తులు శ్రీవారి దర్శనానికి వెళుతున్నారు

Update: 2023-12-02 03:11 GMT

Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. క్యూ లైన్లలో వేచి ఉండగానే నేరుగా భక్తులు శ్రీవారి దర్శనానికి వెళుతున్నారు. శనివారం కూడా భక్తులు రద్దీ అంతగా లేకపోవడానికి తుఫాను ప్రభావమే కారణమని అంచనా వేస్తున్నారు. ఏపీ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, తుపాను హెచ్చరికలతో భక్తుల రద్దీ అంతగా లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు. సహజంగా శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ నేడు అంతగా లేకపోవడానికి కారణం తుపాను కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 56,950 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 20,463 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.75 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు కంపార్ట్‌మెంట్లలోని క్యూ లైన్లలో వేచి ఉండకుండానే నేరుగా స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ భక్తులకు నాలుగు గంటల సమయం మాత్రమే పడుతుంది.



Tags:    

Similar News