చెప్పాల్సిన అవసరం ఉందా?

ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె సినీ పరంగా, రాజకీయ పరంగా సుపరిచితులు.

Update: 2022-04-11 06:51 GMT

ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె సినీ పరంగా, రాజకీయ పరంగా సుపరిచితులు. 2014లో తొలిసారి నగరి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి విజయం సాధించారు. 2019 లోనూ ఆమె గెలుపును ఎవరూ ఆపలేకపోయారు. నిజానికి1999 లో తెలుగుదేశం పార్టీలో చేరి కీలకంగా వ్యవహరించారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పనిచేశారు. తర్వాత వైసీపీలో చేరి రెండుసార్లు నగరి నుంచి గెలిచారు. తొలి మంత్రివర్గంలోనే రోజాకు స్థానం దక్కుతుందని భావించినా రెడ్డి సామాజికవర్గం కావడంతో లభించలేదు. విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు రోజా పార్టీ గొంతుకలా వ్యవహరించారు. అందుకే జగన్ రోజాకు అత్యంత ఇష్టమైన మంత్రి పదవిని ఇచ్చారు.


Tags:    

Similar News