బన్నీ ఉత్సవాల్లో విషాదం
కర్నూలు జిల్లా దేవరగట్టులో విషాదం నెలకొంది. రాత్రి జరిగిన కర్రల సమరంలో యాభై మందికి గాయాలయ్యాయి. ఒక బాలుడు మృతి చెందాడు
కర్నూలు జిల్లా దేవరగట్టులో విషాదం నెలకొంది. రాత్రి జరిగిన కర్రల సమరంలో యాభై మందికి గాయాలయ్యాయి. ఒక బాలుడు మృతి చెందాడు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేదు. సంప్రదాయం ప్రకారం వేల సంఖ్యలో ప్రజలు బన్నీ ఉత్సవంలో పాల్గొన్నారు. కర్రలతో కొట్టుకున్నారు. ఈ సందర్భంగా అనేక మందికి గాయాలయ్యాయి. కర్ణాటకకు చెందిన ఒక బాలుడు బన్నీ ఉత్సవానికి వస్తుండగా మృతి చెందాడు. అయితే గుండెపోటుతో మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
విగ్రహాల కోసం...
ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడం కోసం నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాలు, ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్ గ్రామాల ప్రజలు కర్రలతో యుద్ధం చేశారు. ఈ సమరంలో యాభై మందికి గాయాలు కాగా, అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆదోని, ఆలూరు ఆసుపత్రులకు పంపించి చికిత్స అందిస్తున్నారు. బన్నీ ఉత్సవాన్ని తరలించేందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి లక్షల సంఖ్యలో తరలి వచ్చారు.