చంద్రబాబు పర్యటన... కుప్పంలో టెన్షన్

చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు పార్టీ జెండాలను కట్టించారు

Update: 2022-08-24 11:55 GMT

చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొల్లుపల్లిలో చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు పార్టీ జెండాలను కట్టించారు. వాటిని తొలగించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. చంద్రబాబు మాత్రం ముందుగా అనుకున్న ప్రకారమే పర్యటన జరుగుతుంది.

వైసీపీ వర్సెస్ టీడీపీ...
దీంతో పాటు చంద్రబాబు కొల్లుపల్లి లో ప్రసంగిస్తున్న సమయంలో జగన్ జిందాబాద్ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో పోటీగా టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.


Tags:    

Similar News